ఏపీలో కరోనా వైరస్ కేసుల తీవ్రత భారీగా తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా 300కు అటు, ఇటుగా మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,671 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 179 మందికి పాజిటివ్ అన తేలింది. ఇక కరోనా తీవ్రత కారణంగా నిన్న నలుగురు మృతి చెందారు. ఇక తాజాగా రాష్ట్రంలో 219 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 8,85,616 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇందులో 7,138 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 8,76,140కి మంది ఇప్పటివరకు కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 24 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.