ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టేట్టు కనిపించట్లేదు. తాజాగా మరో 10,328 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,96,789కి చేరింది. ఇందులో 82,166 కేసులు యాక్టివ్ గా ఉండగా 1,12,870 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 72 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 1753కి చేరింది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపూర్ లో 1112, చిత్తూరులో 755, తూర్పు గోదావరి లో 1351, గుంటూరులో 868, కడపలో 604, కృష్ణాలో 363, కర్నూలులో 1285, నెల్లూరులో 788, ప్రకాశంలో 366, శ్రీకాకుళంలో 682, విశాఖపట్నంలో 781, విజయనగరంలో 575, పశ్చిమ గోదావరి జిల్లాలో 798 కేసులు నమోదయ్యాయి.