ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మొత్తం 54,970 సాంపిల్స్ ని పరీక్షించగా 1178 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కోవిడ్ వల్ల కృష్ణ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, చిత్తూర్, తూర్పు గోదావరి, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అలాగే మరోవైపు గడచిన 24 గంటల్లో 1,266 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 2,70,37,651 సాంపిల్స్ ని పరీక్షించారు.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2023242
యాక్టీవ్ కేసుల సంఖ్య…14452
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య..1994855
మొత్తం మృతుల సంఖ్య …13935