84వ సీఆర్పీఎఫ్ డే సందర్భంగా..జగదల్‌పుర్‌లో జరగనున్న వేడుకల్లో పాల్గొనేందుకు 75 మంది మహిళ సీఆర్పీఎఫ్ జవాన్లు..బైక్‌లపై దేశ రాజధాని దిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్.. బస్తర్ జిల్లాలోని జగదల్‌పుర్ పయనమయ్యారు.
మొత్తం 1848కి.మీ. ఈ మహిళా జవాను పయనం జరుగుతుంది. కాగా గురువారం వరకు 1650 కిలోమీటర్ల ప్రయాణించి ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరికి చేరుకున్నారు. వీరికి ఆ ప్రాంత ప్రజలంతా ఘన స్వాగతం పలికారు.
పూలమాలలతో సాదరంగా ఆహ్వానం పలికారు. మార్చి 9న ఇండియా గేట్ నుంచి.. వీరంతా బైక్‌లపై ర్యాలీగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్చి 25న వీరి ప్రయాణం జగదల్‌పుర్‌కు చేరుకుంటుంది. మహిళా సాధికారతను సమాజానికి చూపించడమే బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశ్యమని జవాన్లు చెబుతున్నారు.
వివిధ గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఆగి మహిళలను చైతన్యపరుస్తున్నామని వారు వెల్లడించారు. దిల్లీ నుంచి ఆగ్రా, గ్వాలియర్, శివపురి, భోపాల్, నాగ్‌పుర్ మీదుగా వీరి యాత్ర సాగింది. సాంకేతిక నిపుణులు, డాక్టర్లు వీరిని అనుసరిస్తూ వస్తున్నారు.