ఏపీలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,592 శాంపిల్స్ పరీక్షించగా.. 771 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే తాజా గణాంకాల ప్రకారం…మొత్తం టెస్ట్ ల సంఖ్య 2,81,78,305 కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కి పెరిగింది.
ఇక మరోవైపు ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 20,22,168 కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,150 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 11,912 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.