ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,178 మందికి కరోనా పరీక్షలు చేయగా… 1,367 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 14 మంది మృతి చెందారు. మరోవైపు 1248 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇక రాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,34,786కి చేరగా.. ఇందులో 2006034 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం… మొత్తం మృతుల సంఖ్య 14044కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్ కేసులున్నాయి.