ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా 5వేల మందిని పొట్టనపెట్టుకుంది. కేసుల సంఖ్య ఆరు వేలకు చేరువయ్యాయి. తాజాగా 75,013మందికి టెస్టులు చేయగా 8835మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మరో 64మంది మృతి చెందారు.
రాష్ట్రంలో మొత్తం 5,92,760 కరోనా కేసులుండగా, 5105మంది మరణించారు. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
ఏపీలో కరోనా నుండి కోలుకొని 4,97,376 మంది డిశ్చార్జి కాగా, 90,279 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కంట్రోల్ కావటం లేదు. ఈ ఒక్క జిల్లాలోనే 81 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.