ఏపీలో కరోనా కేసులతో పాటే మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. తాజాగా ఏపీలో కరోనాతో ఇద్దరు మరణించారు. ప.గోదావరిలో ఒకరు, అనంతలో ఒకరు మరణించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 63,821మందికి పరీక్షలు చేయగా… 534మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,77,348కి చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4454యాక్టివ్ కేసులుండగా, 8,65,825మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,069కి చేరింది.