ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 65,101మందికి పరీక్షలు చేయగా 1085మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 1447మంది కోలుకోగా, మరో 8మంది మరణించారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు- 8,63,843
యాక్టివ్ కేసుల సంఖ్య- 13,024
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,43,863
మొత్తం మరణాల సంఖ్య- 6,956
ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య- 97,27,321
ఏపీలో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 224 కేసులు రాగా, అత్యల్పంగా అనంతపురంలో 10కేసులు నమోదయ్యాయి.