ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 43,044మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 753మందికి మాత్రమే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మరో 13మంది మరణించగా… కొత్తగా 1507మంది కోలుకున్నారు.
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,54,764కు చేరగా… 17,892యాక్టివ్ కేసులున్నాయి. 8,29,991మంది ఇప్పటి వరకు కోలుకోగా… 6881మంది మరణించారు. ఏపీలో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 216 కేసులు రాగా, అతి తక్కువగా అనంతపురంలో 4 కేసులు వచ్చాయి.
అయితే, ఏపీలో 80వేలకు పైచిలుకు టెస్టులు జరగనుండగా… ఆదివారం ఆ సంఖ్య సగానికి తగ్గించేశారు.