ఏపీలో గడిచిన 24గంటల్లో 56,409మందికి కరోనా పరీక్షలు చేయగా… 355మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించగా, 354మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కి చేరగా… 3,861యాక్టివ్ కేసులున్నాయి. 8,69,478మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. మరణాల సంఖ్య 7,091కి చేరింది.