ఏపీలో కరోనా పరీక్షలు మరోసారి తగ్గటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. గతంలో 60వేలకు పైగా టెస్టులు చేసిన ఏపీ సర్కార్… వరుసగా ఎన్నికలు, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచుతుందని అంతా భావించారు. కానీ ఏపీలో టెస్టుల సంఖ్య 30వేల పైచిలుకు వరకే పరిమితం అయ్యింది.
ఇటీవల 40వేలకు పైగా కొన్ని రోజులు టెస్టులు చేయగా… ఆదివారం కరోనా టెస్టుల సంఖ్య 31,325కే పరిమితం చేశారు. కొత్తగా 997మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 282మంది కోలుకోగా… మరో ఐదుగురు మరణించారు.
ఏపీలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 181కేసులు, గుంటూరు 152, విశాఖ 139, కృష్ణా 110 కేసులు వచ్చాయి.