ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. కరోనా కేసుల కట్టడిలో కీలకమైన కరోనా టెస్టుల్లో ఏపీ చాలా రాష్ట్రాలతో పోల్చితే ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటికి పైగా కరోనా టెస్టులు చేశారు. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,710మందికి పరీక్షలు చేయగా 620 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్త టెస్టులతో కలిసి ఏపీలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కోటి పదిహేడు వేల ఒక వంద ఇరవై ఆరు టెస్టులు చేసినట్లు ఏపీ ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3787 మంది కరోనా నుండి కోలుకోగా… మరో 7గురు మరణించారు.
ఏపీలో మొత్తం కేసులు- 8,67,683
మొత్తం యాక్టివ్ కేసులు- 8397
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,52,298
మొత్తం మరణాలు- 6988