ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రతి రోజు 100కు పైగా కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. తాజాగా తూ.గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. విద్యార్థి కాలేజీ నుంచి తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ 21మందితో సన్నిహితంగా ఉండే వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.
ఇక రాజమండ్రిలోని ఓ ప్రైవేటు కాలేజీలో కూడా 163మంది వైరస్ బారిన పడ్డారు. ఈ కాలేజీలో రెండ్రోజులుగా 13, 10కేసులు రాగా… సోమవారం ఒక్క రోజే 140కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడున్న 700మంది విద్యార్థులందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. నెగెటివ్ వచ్చిన వారిని వేరే హాస్టల్ లో ఉంచారు.
ఏపీలో కూడా విద్యాసంస్థల్లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.