విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై ఉన్న శ్రీరాముడి ఆలయంలో విగ్రహాం ద్వంసంపై ఏపీ సర్కార్ సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా వేడిని పెంచటంతో పాటు ఇతర వర్గాలు, సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి.
సీఎం జగన్ తో పాటు మంత్రులంతా టీడీపీ నేతల పనేనని, తమ సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం రాకుండా ఇలాంటి నీచరాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మీకు ఇలా చేస్తారన్న సమాచారం ఉన్నా, గతంలో ఇలాంటి ఘటనల్లో పురోగతి ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రామతీర్థం ఘటనలో వెంటనే అరెస్ట్ లు చేపట్టాలని ఆదేశిస్తూ సీఐడీ విచారణకు సర్కార్ ఆదేశించింది. సీఐడీ విచారణకు ఆదేశాలు రాగానే… రెండ్రోజుల్లో అరెస్ట్ లు మొదలవుతాయంటూ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించటం కొసమెరుపు.