ఏపీలో సినిమా టికెట్ బుకింగ్ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. థియేటర్లు, మల్టిప్లెక్సుల్లో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రభుత్వమే ఒక వెబ్ పోర్టల్ తీసుకరానుంది. ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలో ఈ పోర్టల్ పని చేస్తుందని, రైల్వే టికెటింగ్ వ్యవస్థ తరహాలో ఇది పనిచేయాలని ఆదేశిస్తూ కమిటీని నియమించింది.
టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం అని ప్రభుత్వం ప్రకటించింది. హోం సెక్రెటరీ చైర్మన్ గా మొత్తం 8మందితో కమిటీ ఏర్పాటు చేసింది.
ఏపీలో థియేటర్ల సమస్యలు, టికెట్ రేట్లపై సీఎం జగన్ ను కలిసేందుకు సినిమా ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎప్పటికప్పుడు ఆ సమావేశం వాయిదా పడుతుంది. ఈ సమయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సినీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.