ఏపీలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం చేసుకున్న అప్పీల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ కేసులో టీచర్లు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లు కొట్టివేసింది. పిటిషన్లను అనుమతించబోమని తెలిపింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి.
ఇప్పటికే ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫున వాదనలు విన్న కోర్టు, ప్రభుత్వ వాదనలపై ఎస్ఈసీ మరోసారి వాదనలు విన్నది. ఎన్నికలు షెడ్యూల్ అయ్యాక కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇంత వరకు ఇలా ఎక్కడా జరగలేదని న్యాయవాది వాదించారు. ఇందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు.
అందరి వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.