ఏపీలో గడిచిన 24గంటల్లో 49,483మందికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 139మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. చికిత్స పొందుతూ… మరో 254మంది కరోనా నుండి కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,86,557
యాక్టివ్ కేసులు- 1522
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,77,893
మరణాలు- 7,142
కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 24గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదు.