ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమతున్న తరుణంలో… సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుండి రాష్ట్రంలో కుక్కలు, పందులు పెంచుకోవాలనుకుంటే లైసెన్స్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాష్ట్రంలో ఎక్కడా అనుమతిలేని కుక్కలు, పందులు రోడ్లపై తిరగకూడదన్న మాట.
లైసెన్స్ లేకుండా కుక్కను పెంచుకుంటున్నట్లు నిర్ధారణ అయితే 500రూపాయల జరిమానా విధించనున్నారు. ఈమేరకు పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. 500రూపాయల ఫైన్ కట్టాక కూడా లైసెన్స్ తీసుకోకపోతే…. రోజుకు 250రూపాయలు అదనంగా వసూలు చేస్తామన్నారు.
ఒకసారి లైసెన్స్ పూర్తైతే.. 10రోజుల వ్యవధిలో లైసెన్స్ పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.