ఏపీలో గడిచిన 24గంటల్లో 44,935మందికి కరోనా పరీక్షలు చేయగా… 305మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 541మంది కోలుకోగా… నెల్లూరు జిల్లాలో కరోనాతో మరో ఇద్దరు మరణించారు.
ఏపీలో తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 8,75,836కు చేరాయి. ప్రస్తుతం 4728మంది చికిత్స పొందుతుండగా, 8,64,049మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 7059కు చేరాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 43కేసులొచ్చాయి.