కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు కీలకమైన ముందడుగుగా భావిస్తున్న వ్యాక్సిన్ ను ఈ నెలలోనే ఏపీలో పంపిణీ చేయబోతున్నారు. ఈమేరకు వైసీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేస్తూ 4,762కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టనుంది. వైరస్ నియంత్రించేందుకు కోటికి పైగా టెస్టులు చేశామని, ఇప్పుడు వ్యాక్సినేషన్ ను కూడా రికార్డు స్థాయిలో విజయవంతం చేస్తామని విజయసాయి ప్రకటించారు.
అయితే, వ్యాక్సిన్ వేసేందుకు రెడీగా ఉండాలని… అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కానీ అధికారికంగా ఫలానా వ్యాక్సిన్ ను వేసేందుకు అనుమతిచ్చినట్లు ఎక్కడా ప్రకటించలేదు.