విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహాం ద్వంసం విషయంలో ఓవైపు నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. విచారణ జరుగుతుందని ప్రభుత్వం చెప్తూనే… ఆలయ చైర్మన్ గా ఉన్న మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై చర్యలు తీసుకుంది. ఆయన్ను రామతీర్థం సహా మరో రెండు దేవాలయాల కమిటీ చైర్మన్ గా తొలగిస్తూ జీవో జారీ చేసింది.
ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యాతాయుతమైన స్థానంలో ఉండి… పరిరక్షించాల్సిన వ్యక్తి, ప్రతిపక్ష నేతలతో కలిసి నిరసనకు దిగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయాల ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా అశోక్ గజపతిరాజు కొనసాగుతున్నారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఓవైపు తాము నిరసన తెలుపుతుంటే… ప్రతీకార చర్యగా సర్కార్ ఇలా నిర్ణయాలు తీసుకుంటుందని, తమకు అవకాశం వస్తుందని, ఇది మంచి పద్ధతి కాదు అంటూ చంద్రబాబు మండిపడ్డారు.