ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 57 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరులో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య 52కు చేరగా, కేసుల సంఖ్య 2339కి చేరాయి.
ఏపీలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చెన్నై కోయంబేడు మార్కెట్ తో లింకులు ఉన్న కేసుల సంఖ్య కొనసాగుతుంది. దీంతో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1596 మంది డిశ్చార్జ్ కాగా, 691మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24గంటల్లో 9739 శాంపిల్స్ పరీక్షించగా 57 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.