ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. తాజాగా ఏపీలో 9901కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 69మంది మరణించారు. అయితే కొత్తగా నమోదైన కేసులకన్నా ఒక్కరోజు కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఒక్కరోజే 10,292మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మొత్తం 5,57,587కేసులు నమోదవ్వగా, 95,733యాక్టివ్ కేసులున్నాయి. 4,57,008మంది కరోనా నుండి కోలుకున్నారు. 4846మంది మరణించారు.
కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా తూ.గోదావరి జిల్లాలో 1398కేసులు, ప.గోదావరిలో 1069, ప్రకాశం 1146, చిత్తూరు 932కేసులు వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.