ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 40,728మందికి పరీక్షలు చేయగా కేవలం 381మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 934మంది కోలుకోగా… మరో 4గురు మరణించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఇవే అత్యల్ప కేసులు, మరణాలు కావటం విశేషం.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,68,064
యాక్టివ్ కేసుల సంఖ్య- 7840
డిశ్చార్జ్ అయిన వారు- 8,53,232
మొత్తం మరణాలు- 6992