ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇటు కొత్తగా కరోనా మరణాలు కూడా నమోదు కాలేదు. గడిచిన 24గంటల్లో 42,809మందికి కరోనా పరీక్షలు చేయగా… కేవలం 125మందికి మాత్రమే వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా మరో 175మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో ప్రస్తుతం 1,308 మంది చికిత్స పొందుతుంగా, 8,79,131మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ వల్ల 7,152మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,87,591కేసులు గుర్తించారు.