ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. గడిచిన 24గంటల్లో కేవలం 64కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 21,922మందికి పరీక్షలు చేసినట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా 99మంది కరోనాను జయించగా, ఒక్కరు చికిత్స పొందుతూ మరణించారు.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,242కు పడిపోయింది. 8,79,504మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. 7,154మంది ఇప్పటి వరకు మరణించారు. మొత్తంగా ఏపీలో 8,87,900మంది కరోనా వైరస్ బారినపడ్డారు.