ఏపీలో చాలా రోజుల తర్వాత కేవలం రెండంకెల కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 31,696మందిని పరీక్షించగా కేవలం 94కొత్త కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ కృష్ణా జిల్లాలో ఒకరు మరణించగా, 232మంది కోలుకున్నారు.
ఏపీలో మొత్తం కేసులు- 8,85,710
యాక్టివ్ కేసులు- 2,199
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,76,372
మొత్తం మరణాలు- 7,139