ఏపీలో గత రెండు రోజులుగా కరోనా మరణాలు నమోదుకావటంతో అంతా ఊపిరిపీల్చుకోగా, మూడో రోజు మళ్ళీ మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో అనంతపూర్, గుంటూరు, కర్నూలు, విశాఖలో ఒక్కొక్కరు మరణించారు. 48,313మందికి కరోనా పరీక్షలు చేయగా 137మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 167మంది కరోనాను జయించారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు- 8,86,694
యాక్టివ్ కేసులు- 1,488
డిశ్చార్జ్ కేసులు- 8,78,060
మరణాల సంఖ్య- 7,146