ఏపీలో కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గింది. రెండు మూడు రోజులుగా 50లోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 36 కేసులు రాగా, కర్నూలులో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2100కు చేరగా, మరణాల సంఖ్య 48కి చేరింది.
తాజాగా వచ్చిన కేసుల్లో నెల్లూరులో 15 కేసులు, చిత్తూరు-9, గుంటూరు 5, కడప, కృష్ణా, శ్రీకాకుళంలో 2, ప.గోలో ఒక కేసు నమోదయింది. ఇక కేసులు కాస్త తగ్గాయో లేదో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. మాల్స్, థియేటర్లు, చెప్పుల దుకాణాలు, బంగారం, రెడీమెడ్ బట్టల దుకాణాలు మినహా సాయంత్రం 5గంటల వరకు అనుమతించింది. ఉదయం 11 గంటల వరకు పండ్లు, కూరగాయాల దుకాణాలకు అనుమతిచ్చింది.