ఏపీలో కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో ఏపీలో కొత్తగా 68 కేసులు రాగా, ఒకరు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2407కు చేరగా, 715 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 10 కేసులు కోయంబేడు మార్కెట్ లింకు ఉన్న కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులు కోయంబేడు మార్కెట్ తో లింకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఏపీలో ఇప్పటి వరకు 1639మంది కోలుకోగా… 53మంది మరణించారు.
అయితే, కొద్ది రోజులుగా మరణాల సంఖ్య క్రమం తప్పకుండా నమోదవుతుండటం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.