ఏపీలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీలో గురువారం ఒక్కరోజే 9999కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 77మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,74,686కు చేరగా, మరణాల సంఖ్య 4799కు చేరింది.
ఏపీలో ప్రస్తుతం 96,191మంది చికిత్స పొందుతుండగా… 4,46,716మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటి వరకు 44, 52,128మందికి కరోనా టెస్టులు చేసినట్లు తెలిపింది.