ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గించారు. గడిచిన 24గంటల్లో కేవలం 23,417మందికి మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 261కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత ఇంత భారీగా కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో 125మంది కోలుకోగా, మరణాలేవీ సంభవించలేదు.
కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 41కేసులు నమోదయ్యాయి. తూ.గో, ప.గో, కృష్ణా, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో రెండంకెల కేసులు రావటం రాబోయే తీవ్ర పరిస్థితులను హెచ్చరిస్తున్నాయి.