ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. గత వారం రోజులుగా కొత్తగా వస్తున్న కేసులు సంఖ్య 10వేలకు పైగానే ఉంటుంది. తాజాగా గత 24గంటల్లో ఏపీలో కొత్తగా 10,004కొత్త కేసులు వచ్చాయి. మరో 85మంది మరణించగా, 8,772మంది కోలుకున్నారు.
ఏపీలో మొత్తం 4,34,771 కేసులుండగా, 1,00,276యాక్టివ్ కేసులున్నాయి. 3,30,526మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,969మంది మరణించారు. ఏపీలో కొత్తగా చేసిన 56,490టెస్టులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 37,22,912మందికి టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 1086, తూ.గో 1383, ప.గో 1142, శ్రీకాకుళం 1023కొత్త కేసులు వచ్చాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.