ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో జరిగిన సీరో సైర్వే లైన్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 19.7శాతం మందికి కరోనా వచ్చి తగ్గినట్లు తేలింది. ఇందులో 19.7శాతం మంది తమకు కరోనా వచ్చి తగ్గినట్లే తెలియదని ప్రకటించారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఇది 19.3శాతంగా ఉంది. కంటైన్మెంట్ జోన్లలో ఇది 20శాతానికి పైగానే ఉంది.
ఏపీలో కరోనా వచ్చి వెళ్లి పోయిన వారిలో 19.5శాతం పురుషులుండగా, 19.9శాతం మహిళలకు కరోనా వచ్చి తగ్గిపోయింది. పట్టణాల్లో 22.5శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18.2శాతం మందికి కరోనా వచ్చి తగ్గిపోయినట్లు సర్వే తెలిపింది.
ఇక ఏపీలో గడిచిన 24గంటల్లో 10,175కేసులు రాగా, 68మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,37,687 ఉండగా, 97,338మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 4,35,647మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 4702కు పెరిగింది.