ఏపీలో గతంలో కులాల మీద రాజకీయాలు జరిగేవి. అసలు కుల,మత రహిత ఎన్నికలు జరగాలని డిమాండ్ ఉన్న చోట ఇప్పుడు కులంతో పాటు మత రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోయాయి. ఎంతగా అంటే నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినా సరే దేవుడిపై ప్రమాణం చేస్తామంటూ గుడి మెట్లు ఎక్కేస్తున్నారు.
ఇటీవల మీ హాయంలో అవినీతి జరిగింది అంటే మీ హాయంలో అవినీతి జరిగింది అంటూ సత్య ప్రమాణాలు చేశారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అక్కడా టెన్షన్ వాతావరణమే. ఆ తర్వాత ప్రొద్దుటూరు టీడీపీ నేత హాత్య కేసు. నాకు ఆ హత్యతో సంబంధం లేదంటూ ఎమ్మెల్యే రాచమల్లు దేవుడిపై ప్రమాణం చేశారు. ఇక సీఎం జగన్ పై నారా లోకేష్ సింహాద్రి అప్పన్న స్వామి దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ సవాల్ చేయటం, మేం రెడీ అంటూ ఎంపీ విజయసాయి రియాక్ట్ అయిన ఘటనలు అనేకం.
ఇప్పుడు రామతీర్థం ఘటన. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ కొందరు నేతలు మొదటి నుండి మొత్తుకుంటున్నారు. ఇలాంటి టైంలో దూకుడుగా ఉండే బీజేపీ వెనుకపడింది. అయినా అడపాదడపా టీడీపీ, హిందూ సంఘాలు ఇష్యూను ఫోకస్ చేస్తున్నాయి. కానీ రామతీర్థం ఘటనలో బీజేపీ కన్నా ఎక్కువగా టీడీపీ క్యాష్ చేసుకునే పనిలో ఉండగా… మేం తక్కువేమీ తినలేదని వైసీపీ కూడా పోటీయాత్రలు చేపట్టింది. పాడిందే పాటగా ఓ మంత్రి ఏకంగా ఇది ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించేశారు.
దీంతో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గమనిస్తున్న వారంతా పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుంది పరిస్థితి అంటూ కామెంట్ చేస్తున్నారు.