శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించారని దాఖలైన ఫిర్యాదుపై ఏపీ ప్రివిలేజ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు నోటీసులిచ్చింది. విచారణకు హజరయ్యేందుకు రెడీగా ఉండాలంటూ కమిటీ కొన్ని అంశాలను ప్రస్తావించింది.
తాజాగా దీనిపై నిమ్మగడ్డ సమాధానం ఇచ్చారు. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున కొన్నాళ్ల పాటు ప్రయాణాలు చేయలేనని తెలిపారు. తాను అసలు ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే రానని, దీనిపై మీరు ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటే సరైన సమయంలో ఆధారాలతో స్పందిస్తానని తెలిపారు.
తనకు సభపై అత్యున్నత గౌరవం ఉందని, తాను సభ్యుల హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించలేదని నిమ్మగడ్డ తన సమాధానంలో పేర్కొన్నారు.
పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ, ప్రభుత్వంలోని మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు-ప్రత్యారోణపలు జరిగాయి. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి, బొత్స వ్యాఖ్యలపై నిమ్మగడ్డ సీరియస్ గా స్పందించారు.