ఈ ఏడాది కరోనా కారణంగా చదువులు ఇంటికే పరిమితం అయ్యాయి. దీంతో ఆన్ లైన్ క్లాసులపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. అయితే, సిలబస్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పునప్రారంభించింది. దీంతో గతానికి భిన్నంగా, కొంత ఆలస్యంగా పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసింది. జూన్ 5వ తరగతి వరకు క్లాసులు జరగనున్నాయి. మొత్తం 7 పేపర్లతో పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్-
జూన్ 7- ఫస్ట్ లాంగ్వేజ్
జూన్8- సెకండ్ లాంగ్వేజ్
జూన్ 9- ఇంగ్లీష్
జూన్ 10- గణితం
జూన్ 11- సైన్స్ పేపర్-1(ఫిజిక్స్)
జూన్ 12- సైన్స్ పేపర్-2(బయోలజీ)
జూన్ 14- సోషల్ స్టడీస్
సైన్స్ పేపర్లు మాత్రమే రెండు పేపర్లు ఉండనుండగా… ప్రతి పేపర్ 50మార్కులకు ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్ష ఫీజులను పెంచటం లేదని, పాత ఫీజులే చెల్లించాలని సూచించారు.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షలను మే 5 నుండి మే 23వరకు నిర్వహిస్తామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ను మార్చి31 నుండి ఏప్రిల్ 24 వరకు జరుగుతాయన్నారు.