ఏపీలో కరోనా కేసులు మరోసారి తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 45,553 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,190 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం… రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,29,985 కి చేరింది. అలాగే ఇందులో 20,00,877 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇకపోతే, రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టీవ్ కేసులు ఉండగా… 11 మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,988 కి చేరింది.