ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గడిచిన 24గంటల్లో 35,066మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 585 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించగా, 251మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో మొత్తం కేసులు- 8,95,121
యాక్టివ్ కేసులు- 2,946
డిశ్చార్జ్ కేసులు- 8,84,978
మరణాలు- 7,197
కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 128, విశాఖపట్నంలో 81కేసులు వచ్చాయి.