సైమండ్స్ యాక్సిడెంట్ తర్వాత ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే ఏడుపు ఆగదు..! ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ నిన్న కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే శివారులో ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే ఈ ప్రమాదంను లైవ్ లో చూసిన ఓ లేడి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే సైమండ్స్ కు ప్రమాదం జరిగినప్పుడు అందులో మనుషులు ఎవరు లేరు కానీ… ఆయన పెంచుకుంటున్న రెండు కుక్కలు అందులో ఉన్నాయి.ఈ ప్రమాదంలో అవి కూడా చనిపోయి ఉంటాయి అని మేము అనుకున్నాము. కానీ అవి తృటిలో తప్పించుకున్నాయి.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. నా భర్త సైమండ్స్ ను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆయన పల్స్ అక్కడే ఆగిపోయింది. అయితే మేము ఆయనను కాపాడే ప్రయత్నాలు చేస్తుంటే.. సైమండ్స్ పెంపుడు కుక్కతో ఒక్కటి మమల్ని ఆయనే దగ్గరకు వెళ్లనివ్వలేదు. అక్కడ పడి ఉన్న సైమండ్స్ ను చూస్తూ… ఆ కుక్క కళ్ళలో నీళ్లతో అరుస్తూనే ఉంది. దానిని చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అని ఆ మహిళా చెప్పింది.
మేము ఆయనను ప్రమాదం జరిగిన చోటు నుండి ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నిస్తుంటే.. ఆ కుక్క మమల్ని చూస్తూ అరిచింది. అది సైమండ్స్ ను వదిలిపెట్టడానికి అస్సలే సిద్ధంగా లేనట్లు కనిపించింది అని ఆ లేడి పేర్కొంది. అయితే సైమండ్స్ మరణంతో మరోసారి క్రికెట్ ప్రపంచం శోకంలో మునిగిపోయింది. ఎందుకంటే… రెండు నెలల కిందంటే.. ఆసీస్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా మరణించిన విషయం తెలిసిందే. సైమండ్స్ మరణానికి క్రికెటర్లు అందరూ సంతాపాన్ని తెలిపారు. మన ఐపీఎల్ లో కూడా సైమండ్స్ కు నివాళి అర్పిస్తూ.. చేతికి బ్లాక్ బాండ్స్ వేసుకొని మ్యాచ్ ఆడారు.