కొన్ని కొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. తాజాగా చైనాలో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే తిరిగి డబ్బులు ఇవ్వనందుకు ఒక మహిళ తీర్చుకున్న పగ సంచలనం అయింది. పెళ్లి దుస్తులు అమ్మే ఒక దుకాణానికి వెళ్ళిన ఆమె అక్కడ ఉన్న పెళ్లి దుస్తులను ఒక దాని తర్వాత ఒక దాన్ని కోపంతో చింపడం షాక్ కి గురి చేసింది. మహిళ పెళ్లి దుస్తులను ఒకదాని తర్వాత ఒకటి చింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఆమె డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వడానికి స్టోర్ నిరాకరించడంతో ఆమె ఈ చర్యకు దిగింది. ఆ మహిళను జియాంగ్‌గా గుర్తించారు పోలీసులు. చైనాలోని నైరుతి నగరం చాంగ్‌కింగ్‌లో పెళ్లి సెలూన్‌లో ఆమె ఒక కత్తెర తీసుకు వెళ్లి ఈ నెల 9న ఆమె స్టోర్ కు వెళ్లి కనపడిన పెళ్లి దుస్తులను పూర్తిగా నాశనం చేసేసింది. జియాంగ్ 11,000 వేల డాలర్ల విలువ చేసే దుస్తులను నాశనం చేసినట్టుగా షాప్ యాజమాన్యం పేర్కొంది.
అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 8,12,063 లక్షలు అన్నమాట. మొత్తం 32 పెళ్లి దుస్తులను నాశనం చేసిందని అక్కడి మీడియా పేర్కొంది. ఆమె ఆర్డర్ చేసిన దుస్తుల విలువ 1250 డాలర్లు. అంటే రూ. 92,813 రూపాయలు. అందులో ఆమె అడ్వాన్స్ గా 550 డాలర్లు అంటే రూ. 40,837 ఇచ్చింది. ఆ సొమ్ముని షాప్ యాజమాన్యం ఇవ్వకపోవడంతో ఈ పని చేసింది. ఆలోచించమని చెప్తే అది ఎన్ని లక్షలు అయినా సరే దాని నాశనం చేస్తాను అంటూ ఒక్క దాని తర్వాత మరొకటి నాశనం చేసింది.
This angry customer at a Chongqing bridal salon took out scissors and cut up wedding dress after wedding dress. The video has since gone viral on social media. pic.twitter.com/LSRXoI0OAa
— What's on Weibo (@WhatsOnWeibo) January 13, 2022