తన ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేయడం లేదంటూ చేసిన ఫిర్యాదుపై ఓలా సరిగా స్పందించలేదని ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను గాడిదకు కట్టి కాలనీ ఆ వ్యక్తి అంతా తిప్పాడు. వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే సెప్టెంబర్ 2021లో పర్లీలోని ఓ డీలర్ వద్ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేశాడు. దీంతో ఈ ఏడాది మార్చి 24న ఆయనకు ఓలా స్కూటర్ ను డీలర్ డెలివరీ చేశాడు. దీంతో సచిన్ సంతోషించాడు.
కానీ కేవలం ఆరు రోజుల తర్వాత స్కూటర్ సరిగా పనిచేయడం మానేసింది. దీంతో ఓలా షోరూంనకు వెళ్లగా ఫిర్యాదు చేయగా దాన్ని మెకానిక్ కు అప్పగించారు. మెకానిక్ రిపేర్ చేసిన ఆ సమస్య అలాగే కొనసాగింది.
దీంతో కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేశాడు. ఇలా పలు మార్లు కంప్లైంట్ చేసినా ఓలా నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో విసుగుత్తిన సచిన్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను గాడిదకు కట్టి కాలనీ అంతా తిప్పాడు. తయారీదారున్ని నమ్మవద్దని ప్రజలను కోరుతూ బ్యానర్ లు ఏర్పాటు చేశాడు.