రిలయన్స్ దిగ్గజం అంబానీ రాజీనామా చేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. తీవ్ర నష్టాల్లో సంస్థ కురుకపోవటంతో… ఇక తన వల్ల కాదంటూ రాజీనామా బాట పట్టారు. అయితే రాజీనామా చేసింది ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ.
రిలయన్స్ పంపకాల్లో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనిల్ అంబానీకి వచ్చింది. ఆర్‌కామ్ పేరుతో సేవలు కొనసాగించారు అనిల్ అంబానీ. ఎయిర్‌టెల్, ఐడియాకు పోటీగా ఎన్నో ఆఫర్స్ ప్రకటించినా… పోటీకి తట్టుకోలేక చేతులెత్తేసింది ఆరాకామ్. తను చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్న ముఖేష్ అంబానీ ఆదుకొని అనిల్‌ను గట్టేక్కించారు.
ఇరువురి మధ్య ఎన్నో గొడవలు జరిగినా.. అవేవీ పట్టించుకోకుండా ముఖేష్ బయటపడేశారని అప్పట్లో పెద్ద ప్రచారమే సాగింది. అయితే… ఇక ఎన్నాళ్లు ఉన్నా ఈ సంస్థను బాగు పర్చలేమన్న ఉద్దేశంతోనే అనిల్ ఆర్‌కామ్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పదవికి అనిల్ రాజీనామా చేయగా… ఇతర డైరెక్టర్లు కూడా అనిల్ అంబానీ బాటలోనే నడిచారు.