ఓ సినిమా హిట్టయితే దానికి సీక్వెల్ తీయడం కామన్. ఎఫ్3 కూడా అలానే వస్తోందని అంతా అనుకుంటున్నారు. కానీ అనీల్ రావిపూడి మాత్రం మరో వెర్షన్ చెబుతున్నాడు. హిట్టయిన సినిమాపై డబ్బులు చేసుకోవడానికి సీక్వెల్ తీయడం లేదని క్లారిటీ ఇస్తున్నాడు.
“సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ సినిమాని చేయడానికి కారణం కమర్షియల్ గా ఫ్రాంచైజీ కంటిన్యూ చేసి డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశం కాదు. ఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళినపుడు ఒక థియేటర్ లో సినిమా రెస్పాన్స్ చూశా. ఒక ఫ్యామిలీ మొత్తం వరుసలో కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకోవడం చూశాను. ఒకరిని నవ్వించడంలో ఎంత కిక్ ఉంటుందో అప్పుడు అర్ధమైంది. అందుకే ఎఫ్ 3ని స్టార్ట్ చేశా.”
ఎఫ్3 హిట్టయితే ఎఫ్4 కూడా తీస్తానంటున్నాడు రావిపూడి. ఈ ఫ్రాంచైతీలో సీక్వెల్ తీయడానికి తన ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపాడు. పేరుకు ఇది సీక్వెల్ అయినప్పటికీ, పూర్తిగా కొత్త కథ అని చెప్పుకొచ్చాడు.
“ఈ సినిమాని మీరు ఆదరిస్తే ఎఫ్ 4 తీయడానికి కూడా రెడీ. ఎఫ్ 2ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో నటీనటులంతా ఎఫ్ 3 చేశారు. ఆల్రెడీ హిట్ కొట్టేశామనే నమ్మకంతో యాక్ట్ చేశారు. వెంకటేష్ గారు ఎంటర్ టైనర్ చేయడంలో ఎవరెస్ట్. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వరుణ్ తేజ్ మై బ్రదర్. వరుణ్ తేజ్ గారి ఫన్ టైమింగ్ అదిరిపోతుంది. తమన్నా రోల్ ఎఫ్ 2కి మించి వుంటుంది. తమన్నా, సోనాల్ కి సంబధించి ఒక సర్ ప్రైజ్ వుంది. అది థియేటర్ లో తెలుస్తుంది.”
దిల్ రాజు నిర్మించిన ఎఫ్3 సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్, శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకున్నాయి.