ఎఫ్3 ప్రమోషన్ లో అందరూ పాల్గొన్నారు. ఒక్క తమన్న తప్ప. ఆమె ఎందుకు రాలేదు? ఆమెకు, దర్శకుడు అనిల్ రావిపూడికి మధ్య గొడవ జరగడం వల్లనే అనేది సమాధానం. మొన్నటివరకు ఇది గాసిప్ స్టేజ్ లోనే ఉంది. కానీ.. ఇప్పుడదే నిజమైంది. స్వయంగా అనిల్ రావిపూడి, తమన్నాతో తనకు గొడవ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు.
“తమన్నాకు నాకు గొడవ జరిగిన మాట వాస్తవం. అయితే అది పెద్దదేం కాదు. ఓరోజు టైమ్ కు షూటింగ్ కు రాలేదు. పైగా ఆరోజు ఎక్స్ టెన్షన్ షూట్ ఉంది. కానీ.. ఆ అమ్మాయి మాత్రం ఒప్పుకోలేదు. పొద్దున్నే జిమ్ చేసుకోవాలి, టైమ్ లేదు అంటూ వాదించింది. ఆరోజు ఆర్టిస్టుల కాంబినేషన్. తమన్నా కోసం అన్నీ మార్చలేం కదా. వేరే వాళ్లకు ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు చిన్న వాదన జరిగింది. ఓ 2 రోజుల పాటు మా ఇద్దరి మధ్య హాట్ హాట్ గా ఉంది వాతావరణం” అని చెప్పాడు.
అంతకు మించి తమన్నాతో తనకు పెద్దగా గొడవ జరగలేదన్నాడు అనిల్. ఆ ఘటన జరిగిన తర్వాత తానే వెళ్లి తమన్నాతో మాటలు కలిపానని, ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నామని అన్నాడు. ఆర్టిస్టులతో అభిప్రాయబేధాలొస్తే, సినిమాపై ప్రభావం పడుతుందని, అందుకే తానే వెళ్లి మాట్లాడానని చెప్పాడు.
ఇక ప్రచారంపై స్పందిస్తూ.. తమన్నా వేరే షూట్ లో బిజీగా ఉండడం వల్ల ఎఫ్3 ప్రమోషన్ కు రాలేకపోయిందని, పైగా ఆమె ఇండియాలో లేదని చెబుతున్నాడు రావిపూడి. మరికొన్ని రోజుల్లో ఎఫ్3 ప్రమోషన్స్ లోకి తమన్నా వచ్చి చేరుతుందని చెబుతున్నాడు.
మరోవైపు ఎఫ్4లో మాత్రం తమన్నా ఉండదని స్పష్టం చేశాడు రావిపూడి. ఆమెతో పాటు మెహ్రీన్ ను కూడా మార్చేస్తానంటున్నాడు. హీరోలుగా వెంకీ-వరుణ్ ఉంటారని, హీరోయిన్లను మాత్రం మార్చేస్తానని తెలిపాడు.