అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎఫ్2. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.అంతే కాకుండా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కుతుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.
కాగా తాజాగా బుధవారం మొదటి రోజు షూటింగ్ మొదలు పెట్టింది. ఫస్ట్ డే షూటింగ్ జరిపిన ఒక ఫోటోను అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సక్సెస్ ఫుల్లీ మొదటిరోజు షూట్ ముగిసింది అంటూ పోస్ట్ చేశారు. ఇకపోతే ఈ ఫోటో చూస్తే కరోనా నియమాలతో షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫోటో లో వెంకటేష్ తో పాటు దర్శకుడు అనిల్ ఇతర టెక్నీషియన్స్ మాస్క్ లతో కనిపిస్తున్నారు.