దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఓ చర్చపై క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. అప్పుడెప్పుడో ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ ఫెక్ట్ అనే సినిమా వచ్చింది. దానికి దశరథ్ దర్శకుడు. అయితే ఆ సినిమా రైటర్స్ టీమ్ లో అనీల్ రావిపూడి కూడా ఉన్నాడని ప్రచారం జరిగింది. మిస్టర్ పర్ ఫెక్ట్ కు అనిల్ రావిపూడే డైలాగ్స్ రాశాడని కూడా అంటారు చాలామంది. వికీపీడియా ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది కూడా.
ఎట్టకేలకు దీనిపై రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. తనకు మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. వికీపీడియాలో కనిపించిందంతా వాస్తవం కాదని తెలిపాడు.
“మిస్టర్ పర్ ఫెక్ట్ కు నేను రైటర్ ను కాదు, నాకు సంబంధం లేదు. వికీపీడియాలో ఎవరో తెచ్చి నా పేరు వేశారు. దానికి నాకు సంబంధం లేదు. మిస్టర్ పర్ ఫెక్ట్ కు దశరధ్ డైరక్టర్. మరికొంతమంది రైటర్లు కూడా పనిచేశారు. నేను మాత్రం వర్క్ చేయలేదు.”
ఇలా ఏడాదిగా తనపై నలుగుతున్న ఓ గాసిప్ కు క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఎఫ్3 సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ దర్శకుడు.. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించాడు. ఇదే ఇంటర్వ్యూలో మహేష్ బాబుపై స్పందిస్తూ.. మహేష్ ఎప్పుడు స్లాట్ కేటాయిస్తే, అప్పుడు సినిమా చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.