లాక్ డౌన్ ముగియగానే F3 మూవీ పట్టాలెక్కనుంది. ఇప్పటికే F2తో మంచి సక్సెస్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరుతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పడు F3కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ లు మూవీ సీక్వెల్ కు అంగీకరించారు. అయితే… ఫైనల్ డ్రాఫ్ట్ ను వారికి వినిపించాల్సి ఉంది. ఈ మూవీలోనూ తమన్నా, మెహ్రిన్ నటిస్తున్నారు. అయితే… వెంకీ, వరుణ్ కు తోడుగా మరో లీడ్ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని చివరి వరకు సస్పెన్స్ గా ఉంచాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం.
F3ని కూడా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనుండగా… వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేసుకున్నారు.