ప్రభాస్..భారీ ప్రాజెక్ట్ల బాహుబలి. అర్జున్ రెడ్డి మూవీ దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీకి సైన్ చేసాడు.ఈ నేపథ్యంలో సందీప్, ప్రభాస్ కాంబో ఎలా ఉండబోతుందోనని అటు ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, ఇటు సినీప్రియులకు సైతం భారీ అంచనాలు మొదలయ్యాయి.
అంతే కాకుండా ఈ మూవీలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. కాగా ప్రభాస్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు మోపయ్యాయి. గతంలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందని ఆశించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురయ్యింది.
అయితే తాజాగా వచ్చిన సమచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో షూట్కు వెళ్లే ఛాన్స్ లేదట. ఎందుకంటే అటు ప్రభాస్.. ఇటు సందీప్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో ఈ మూవీ పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పట్టనుందట.
కాగా నిర్మాత భూషణ్ కుమార్ మాత్రం సినిమా షూట్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్.. ‘స్పిరిట్’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ఇచ్చారు. ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా షూట్లో బిజీగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ మూవీని పట్టాలెక్కించే పనిలో పడిపోనున్నారట.
అంతే కాకుండా ప్రభాస్ సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నందున ఆయన ఈ సినిమాను ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కు మించి తీసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.